NEW DELHI MEDIA HOUSE
Breaking News

Telugu Cinema Kathanalu

చెర్రీ మాస్ లుక్ అదిరిపోయింది .

రామ్ చరణ్ - డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమా రంగస్థలం. ఈ సినిమా ఫస్ట్‌లుక్ శనివారం విడుదలై దుమ్ము లేపింది. ఫస్ట్‌లుక్‌లో చెర్రీ చిందేస్తున్నట్టుగా తీసిన స్టిల్ అదిరిపోయింది. చెర్రీ మాస్ లుక్ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది.  
అన్నయ్యతో కలిసి పవన్ తెరపై .

తాజాగా సైరాలోనూ అన్నయ్యతో కలిసి పవన్ తెరపై కనిపిస్తాడని తెలుస్తోంది. ఈ సినిమాలో 10 నిమిషాల నిడివి కలిగిన ఒక ముఖ్యమైన పాత్ర ఉండటంతో, స్టార్ హీరోతోనే ఆ పాత్ర చేయించాలని ఈ సినిమా టీమ్ భావించిందట. ఈ పాత్రలో వెంకటేశ్ కనిపించనున్నట్టు ప్రచారం జరిగింది. కానీ అందులో నిజం లేదని తేలిపోయింది. ఈ పాత్ర కోసం పవన్ కల్యాణ్‌ను సంప్రదించగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు తెలుస్తోంది.    
వర్మ స్పెషాలిటీ, వద్దు అంటున్నా పోసాని. !!!.

 సినిమాల కన్నా టివి ఇంటర్వ్యూలలో వర్మ చెప్పే సమాధానాలు అటు యాంకర్‌ను ఇటు ప్రేక్షకులను ఆశ్చర్యపడేలా చేస్తుంది. ప్రశ్నకు సమాధానానికి ఎలాంటి పొంతన లేకుండా చెప్పడం వర్మ స్పెషాలిటీ. ఇది అందరికీ తెలిసిందే. అయితే అలాంటి వర్మ మరో బయోపిక్‌కు శ్రీకారం చుట్టాడు. అది కూడా మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జీవిత చరిత్రమీదే.   
ఖైదీ నంబర్.150 సాంగ్ రిలీజ్

మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా వి.వి. వినాయక్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఖైదీ నంబర్‌ 150'. ఈ చిత్రంలోని ప్రత్యేక గీతంలో రాయ్‌లక్ష్మితో కలిసి చిరు చిందేశారు. 'రత్తాలు రత్తాలు.. ఓసోసీ రత్తాలు' అని సాగే ఈ పాటకు ప్రస్తుతం యూట్యూబ్‌లో మంచి స్పందన లభిస్తోంది.   
కృష్ణ 'దేవుడు లాంటి మనిషి'

సూపర్‌స్టార్‌ కృష్ణ 50 నట వసంతాలను పూర్తిచేసుకున్న సందర్భంగా సీనియర్‌ పాత్రికేయులు వినాయకరావు కృష్ణ నట జీవితంపై, కృష్ణ నటించిన 365 చిత్రాలు గురించి రాసిన 'దేవుడు లాంటి మనిషి' పుస్తకావిష్కరణలో ఆయన మాట్లాడారు. శనివారం హైదరాబాద్‌ పార్క్‌ హయత్‌లో జరిగింది.  
గౌతమిపుత్ర శాతకర్ణి ట్రైలర్‌ విడుదల .

కరీంనగర్‌: నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ప్రచార చిత్రం విడుదల శుక్రవారం సాయంత్రం కరీంనగర్‌ పట్టణంలో వేడుకగా జరిగింది. బాలయ్య అభిమానుల కోలాహలం మధ్య ఈ ట్రైలర్‌ను తిరుమల థియేటర్‌లో విడుదల చేశారు.  
‘కాఫీ విత్‌ కరణ్‌’ షో కత్రినా సల్లూభాయ్‌.

సల్మాన్‌ఖాన్‌.. కత్రినాకైఫ్‌ కొన్నాళ్ల క్రితం విడిపోయి ఎవరి దారి వారు చూసుకున్నారు. తర్వాత కత్రినా.. రణ్‌బీర్‌ కపూర్‌తో ప్రేమలో పడింది.   
సల్మాన్‌ రూ.300కోట్ల భారీ బడ్జెట్‌ సినిమా .

సల్మాన్‌.. నిర్మాతగా భారీ బడ్జెట్‌ సినిమాను పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యారు. మరో నిర్మాతతో కలిసి రూ.300కోట్ల బడ్జెట్‌తో 102ఏళ్ల క్రితం జరిగిన ఓ సంఘటనను సినిమాగా నిర్మిస్తున్నారట సల్లూభాయ్‌.  
150 కోట్లు ప్రభాస్ జేమ్స్ బాండ్ !! .

భరించలేని ఖర్చును, పోషించలేనంత భారాన్ని తెల్ల ఏనుగుతో పోల్చడం కామన్. యువి క్రియేషన్స్ సంస్థ ప్రభాస్-సుజిత్ కాంబినేషన్ లో చేయబోయే సినిమా కోసం ఇలాంటి ఓ తెల్ల ఏనుగును భరించడానికి రెడీ అయిపోయిందట. దిగ్దర్శకుడు శంకర్ తన రోబో 2 సినిమాకు సైతం భరించలేకపోయిన హాలీవుడ్ టెక్నీషియన్ ను ప్రభాస్ సినిమాకు నియమించుకున్నారట.         
చిరంజీవి సినిమా కాన్ఫిడెన్స్ మాయం అయిందా?

చిరంజీవి తన 150 వ సినిమా విజయం కావాలని ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తున్నారు. సినిమా పరంగా చేయాల్సినదంతా చేస్తున్నారు. దీనికి ఫ్యాన్స్ కూడా తమ వంతు సాయం తాము చేస్తున్నారు.  
శాతకర్ణి చిత్రం బాహుబలికి పోటీ కాదా !!.

నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మక వందో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. ఈ చిత్రం టీజర్‌ను దసరా కానుకగా ఆ చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో హీరో కనిపించే సీన్ అద్భుతంగా ఉందని అభిమానులు చెప్పుకుంటున్నారు. పైగా, ఈ చిత్రంలో బాలకృష్ణ చెప్పిన డైలాగులు సంచలనం సృష్టిస్తూ రికార్డు స్థాయిలో ఈ టీజర్‌కు వ్యూవర్‌షిప్‌ను పెంచుతున్నాయి. సాధారణ అభిమానుల నుంచి స్టార్ల వరకు ఈ టీజర్ బాగుందని మెచ్చుకుంటున్నారు.   
విజయదశమి కానుకగా బాలకృష్ణ టీజర్‌,.

నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎప్పుడెప్పుడా.? అని ఎదురు చూస్తోన్న 'గౌతమి పుత్ర శాతకర్ణి' సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం విదితమే. క్రిష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో శ్రియ, హేమమాలిని తదితరులు నటిస్తున్నారు.   
సోషల్ మీడియాలో హీరోయిన్ సమంత రుసరుసలు!!!

సోషల్ మీడియాలో హీరోయిన్ సమంత ఎవరిపై కోపాన్ని ప్రదర్శించిందో తెలియట్లేదు. ఇప్పటికే అక్కినేని వారింట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయని కొందరు, అఖిల్ కూడా ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నాడని మీడియా కోడైకూస్తోంది.  
కబాలి గా రజని ఘర్జన : జూన్ 1 నుండి

రజనీకాంత్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం‘కబాలి’. రాధికా ఆప్టే కథానాయిక. కలైపులి.ఎస్‌.థాను నిర్మాత. పా రంజిత్‌ దర్శకత్వం వహించారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. వచ్చే నెల మొదటి వారంలో పాటల్ని, జులై 1న చిత్రాన్నీ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘ఈ నెల 1న విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. ఇప్పటివరకూ సుమారు కోటిన్నరమంది వీక్షించారు. రజనీ చెప్పిన డైలాగులు మార్మోగుతున్నాయి. రజనీకాంత్‌ మాత్రమే చేయగలిగిన సినిమా ఇది. సంతోష్‌ నారాయణ్‌ మంచి బాణీల్ని అందించార’’న్నారు. ధ¿న్సిక, కిషోర్‌, జాన్‌ విజయ్‌ తదితరులు నటించారు. ఛాయాగ్రహణం: మురళి, మాటలు: సాహితి, పాటలు: సిరివెన్నెల, చంద్రబోస్‌, అనంత్‌ శ్రీరామ్‌  
అల్లు అర్జున్ పవన్ వివాదానికి తెర దించిన బన్నీ

పవర్ స్టార్ గురించి నేను మాట్లాడను అంటూ బన్నీ చేసిన కామెంట్ల గురించి పెద్ద చర్చే జరిగింది. దీనికి అల్లు అర్జున్ ఫుల్ స్టాప్ పెట్టేశాడు. నిహారిక, నాగశౌర్య నటించిన ఒక మనసు ఆడియో వేడుక సందర్భంగా హాజరయిన అల్లు అర్జున్ సూటిగా ఈ విషయాలపై చర్చించాడు. అల్లు అర్జున్ మాటల్లోనే... బ్రదర్స్ మీతో 10 నిమిషాలు మాట్లాడాలి. తప్పకుండా అన్నీ మాట్లాడేస్తా. బయటి ఫంక్షన్లకు వెళ్లి పవర్ స్టార్ పవర్ స్టార్ అని అరుస్తున్నారు. వారు వాళ్లు హర్ట్ అవుతారు కదా. ఒక మిత్రుడు మా వాళ్ల ఫంక్షన్లో మీ వాళ్ల గోలేంటి బ్రదర్ అన్నారు. కరెక్టే కదా.  
నాగార్జున సినీ ప్రస్తనంలోనే అతి పెద్ద హిట్: ఊపిరి.

హైదరాబాద్: నాగార్జున, కార్తీ, తమన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'ఊపిరి'. ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాల్ని రాబట్టింది. ఈ సినిమా తర్వాత కొన్ని పెద్ద సినిమాలు విడుదలైనా పోటీని తట్టుకుని నిలిచింది. ప్రస్తుతం అన్ని చోట్ల ఊపిరి బాక్సాఫీసు బిజినెస్ ముగిసింది.  
నటి సంఘవి పెళ్లి చేసుకోబోతోంది!

నటి సంఘవి పెళ్లి చేసుకోబోతోంది!  
చిరంజీవి పక్కన వెంకటేశ్ హీరోయిన్ నయన

చిరంజీవి పక్కన వెంకటేశ్ హీరోయిన్ నయన......  
నాది కామెడీ ఫేస్ కాదు : పృథ్వీరాజ్

'నాది కామెడీ ఫేస్ కాదని...సీరియస్ గా ఉంటుందని' హాస్యనటుడు పృథ్వీరాజ్ చెప్పారు.  
నేటి మరదలు... రేపటి పోలీస్ ఆఫీసర్!

Anasuya is playing a cop  
 
Video Gallery
Photo Gallery
  • Movie Gallery
  • heroins