NEW DELHI MEDIA HOUSE
Breaking News

Vaarthalu

అమ‌రావ‌తి సంక్రాంతి సంబ‌రాలు.

రాష్ట్ర ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ సంక్రాంతి వేడుక‌ల‌ను వైభ‌వంగా నిర్వహించ‌నుంది. ‘‘అమ‌రావ‌తి సంక్రాంతి జీవ‌న వార‌స‌త్వ సంబ‌రాలు’’ పేరిట అమ‌రావ‌తి వేదిక‌గా జ‌న‌వ‌రి 8వ తేదీ నుండి 15వ తేదీ వ‌ర‌కు ఈ కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నామ‌ని ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ కార్య‌ద‌ర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. వెల‌గ‌పూడి స‌చివాల‌యంలోని త‌న ఛాంబ‌ర్‌లో సంబ‌రాల నిర్వ‌హ‌ణ‌పై ఉన్న‌త‌స్ధాయి స‌మీక్ష నిర్వ‌హించారు.   
బాబోయ్ బంగారు బాబా..!!!

బంగారం అంటే మక్కువ ఎవరికి ఉండదు? మరికొందరికయితే అది మరీ ఎక్కువ ఈ కోవకు చెందిన వ్యక్తే ఆ బాబా...బాబాకు, బంగారానికి సంబంధం ఏమిటీ అనుకుంటున్నారా? అయితే ఇది చదవండి... ఆయన పేరు సుధీర్ మక్కర్. బంగారు బాబా అంటే చాలామంది టక్కున గుర్తుపడతారు. ఆయన ఒళ్లంతా బంగారమే.  
కులిన సైనిక విమానం!

మిస్సిస్సిపీ: అమెరికాకు చెందిన ఓ సైనిక విమానం మిస్సిస్సిపీ ప్రాంతంలో కుప్పకూలింది. విమానంలో ఉన్న మొత్తం 16 మంది మృతి చెందినట్లు సమాచారం. విమానం కూలిన అనంతరం శకలాలు కొన్ని మైళ్ల దూరం వరకూ పడిపోయినట్లు అధికారులు తెలిపారు. మృతదేహాలకోసం గాలింపు చర్యలు చేపట్టారు  
పెరిగిన పెట్రొల్ ధర.

దేశంలో మళ్లీ పెట్రో ధరలు పెరిగాయి. ఈనెల ఆరంభంలో ధరలు తగ్గించినట్టే తగ్గించి.. మళ్లీ ధరలు పెంచాయి. పెంచిన ధరలు తక్షణం అమల్లోకి వచ్చాయి. తాజాగా, పెట్రోలుపై రూ.1.39, డీజెల్‌పై రూ.1.04 మేరకు పెంచుతున్నట్టు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రకటించాయి. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని చమురు కంపెనీలు ఓ ప్రకటనలో తెలిపాయి.   
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో రోబో.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లోకి అడుగు పెట్టినప్పుడు, ‘మీకు ఏ విధంగా సహాయపడగల’ను అంటూ ఆప్యాయంగా పలకరించే ఉద్యోగి కనిపిస్తే.. కాస్త తేరిపార చూడండి. ఎందుకంటే..? ఆ ఉద్యోగి ఏ రోబోనో అయి ఉండొచ్చు.  
బుధుడు, శుక్రుడు, భూమి పూర్తిగా ధ్వంసమవుతాయా !!?.

ఓజోన్ పొరలో ఏర్పడిన మార్పుల కారణంగా ప్రకృతీ వైపరీత్యాలు పెచ్చరిల్లిపోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భూమి కథ ఎలా ముగుస్తుందో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. మనకు 200 కాంతి సంవత్సరాల దూరంలో 'ఎల్‌2 పుపిన్స్‌'గా పిలిచే ఓ భారీ నక్షత్రముంది.  
అల్లంత దూరానఅందంగా ఆంద్ర గోవా.!!

సహజసిద్ధమైన సముద్ర తీరం. అర్థ చంద్రాకారంలో కనిపించే తీరప్రాంతం. అల్లంత దూరాన కనిపిస్తూ మదిని దోచే నల్లటికొండలు. తీరాన్ని ఆనుకొని అందంగా ప్రవహించే ఉప్పుటేరు. తీరంవద్ద నిలిపిఉంచే రంగురంగుల పడవులు... ఇదేదో గోవా బీచ్‌ గురించేమో అనుకుంటున్నారా.. అక్కడే విశాఖ జిల్లాలోని పూడిమడక గురించే...  
నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్‌ఎల్వీ-ఎఫ్‌05

శ్రీహరికోట: ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌05 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌ కేంద్రం నుంచి ఈ వాహకనౌకను ప్రయోగించారు.  
దేవినేని నెహ్రూ ,టీడీపీలోకి చేర‌డం వెనుక అవినాష్ !!!!.

విజ‌య‌వాడ‌: గ‌త నాలుగు ద‌శాబ్దాలుగా బెజ‌వాడ‌ను గ‌డ‌గ‌డ‌లాడించిన మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత దేవినేని నెహ్రూ టీడీపీలోకి ఎందుకు మారుతున్నారు?  తెలుగుదేశాన్ని ఎన్టీయార్‌తో క‌లిసి మోసి, చివ‌రి వ‌ర‌కు అన్న‌గారితోనే ఉండిపోయిన నెహ్రూ... త‌ర్వాత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అప్ప‌టి నుంచి వెన‌క‌డుగు వేయ‌కుండా... కాంగ్రెస్ లోనే ఉండిపోయారు. అధికారం ఉన్నా లేకున్నా దేవినేని హ‌వా, విజ‌య‌వాడ‌లో కొన‌సాగించారు.   
‘మిస్‌ జపాన్‌’ ఏనుగుల శిక్షకురాలు .,

టోక్యో: భారత మూలాలున్న జపాన్‌ అందాల సుందరి ప్రియాంక యోషికవా (22) ‘మిస్‌ జపాన్‌’ కిరీటాన్ని గెలుచుకున్నారు. భారతీయుడైన తండ్రి, జపాన్‌ దేశస్థురాలైన తల్లి అందచందాలన్నీ పుణికి పుచ్చుకున్న పొడగరి (5 అడుగుల8 అంగుళాలు) ప్రియాంకకు ఏనుగుల శిక్షకురాలిగా అధీకృత లైసెన్స్‌ ఉండటం మరో ప్రత్యేకత.  
పైరసీపై ముంబై హైకోర్టు సంచలన తీర్పు

పైరసీపై ముంబై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆన్‌లైన్‌లో పైరసీ సినిమాలు చూడటం నేరం కాదని, శిక్షార్హం కూడా కాదని ముంబయి హైకోర్టు వ్యాఖ్యానించింది.పైరసీ భూతంతో నిర్మాతలు, దర్శకులు కోట్లాది రూపాయలు నష్టపోతున్న సంగతి తెలిసిందే. విడుదలైన తొలిరోజే నెట్లో సినిమా ప్రత్యక్షమవుతోంది. తద్వారా కోట్ల రూపాయల నష్టం తప్పట్లేదని ఫిల్మ్‌ ప్రొడ్యూసర్ల సమాఖ్య ముంబయి హైకోర్టులో కేసు వేసింది.   
తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు

ఛత్తీస్‌గడ్‌ మీదుగా వాయువ్యదిశగా ఉపరితల ఆవర్తనం కదులుతోంది. దీని ప్రభావంతో మరో 24 గంటల పాటు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు, భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.   
నేటితరం ఒంటరి బతుకులకు శునకాలే చేదోడుమరి !!!! !!

సాటి మనిషినే కాదు, చివరకూ కన్న కొడుకును కూడా నమ్మలేనిస్థితికి చేరిన ఆధునిక సమాజం, కుక్క చూపించే విశ్వాసానికి ఫిదా అయిపోయింది. ‘కనకపు సింహాసనము పైన శునకము కూర్చుండ దగునా... అంటూ విలువల సంరక్షణ కోసం రాగాలు తీసిన వారు ఇప్పుడంత ధైర్యంగా కుక్కను దూషించలేక పోతున్నారు.   
"గ్యాంగ్‌స్టర్ నయీమ్" లైట్స్ కెమెరా యాక్షన్ : వర్మ

గ్యాంగ్‌స్టర్ నయీమ్ జీవితం ఆధారంగా మూడు సినిమాలు తెరకెక్కబోతున్నట్లు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. నయీమ్ నక్సలైట్ నుంచి పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా ఆపై అండర్‌వరల్డ్ గ్యాంగ్‌స్టర్‌గా ఆ తర్వాత కరుడుగట్టిన నేరగాడిగా మారిన విధానం భయం కలిగించేలా ఉందన్నాడు.  
చరిత్ర సృష్టించిన పి.వి.సింధుపై ప్రశంసల జల్లు....

రియో ఒలింపిక్స్ క్రీడల్లో రజత పతకం సాధించి చరిత్ర సృష్టించిన పి.వి.సింధుపై రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు  సోనియా గాంధీ, బీజేపీ అధినేత అమిత్ షా,  పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ప్రశంసల వర్షం కురిపించారు.   
మాటల్లో వర్ణించే పురుషులంటేనే మగువలకి ఇష్టం.

స్త్రీలను సంతోషపెట్టడం బ్రహ్మ విద్యేమి కాదు. వారితో చనువుగా, ఆప్యాయంగా మాట్లాడితేనే చాలు అవే వారు ఎక్కువగా కోరుకుంటారు. వారితో ప్రేమగా, ఆప్యాయంగా మాట్లాడితే చాలు. తాను ఆమెను ఎంతగా ప్రేమిస్తున్నాడో మాటల్లో వర్ణించే పురుషులంటేనే మగువలకి ఇష్టం.   
366 మీటర్ల భారీ జాతీయ జెండా.....

పిడుగురాళ్ల: గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో మన్నె పుల్లారెడ్డి హైస్కూల్‌లో 70వ స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ ఏడాది లీపు సంవత్సరం కావడంతో 366 మీటర్ల భారీ జాతీయ జెండాను పట్టణ వీధుల్లో ప్రదర్శించారు. ఈ ర్యాలీలో సుమారు 4వేల మంది విద్యార్థులు, 5వేల మంది పట్టణ ప్రజలు పాల్గొన్నారు. అనంతరం గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్‌ జాతీయ జెండాను ఎగురవేశారు. పిడుగురాళ్లకు చెందిన వ్యాపారి కాకుమాను జగన్నాథం ఈ జెండాను రూపొందించి పాఠశాలకు బహుమతిగా ఇచ్చారు.  
బంగాళాఖాతంలో అల్పపీడనం....

విశాఖ: ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని స్పష్టం చేసింది. ఇది 48 గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అల్పపీడనం ప్రభావంతో కోస్తాలో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.  
మెగసెసె అవార్డు 2016 ఇద్దరు భారతీయులుకు

దిల్లీ: ప్రతిష్ఠాత్మక రామన్‌ మెగసెసె అవార్డుకు 2016 సంవత్సరానికి గాను ఇద్దరు భారతీయులు ఎంపికయ్యారు. వారిలో ఒకరు మానవ హక్కుల కార్యకర్త బెజ్‌వాడ విల్సన్‌ కాగా, మరొకరు సంగీత విద్వాంసులు టీఎం కృష్ణ. ఆసియాలో నిస్వార్థ సేవాపరులను గౌరవించటానికి ఫిలిప్పీన్స్‌ మాజీ అధ్యక్షుడు రామన్‌ మెగసెసె పేరిట నెలకొల్పిన ఈ అవార్డును ఏటా అందజేస్తారు.  
అదృశ్యమైన ఏఎన్-32 ఆచూకీ ??

బంగాళాఖాతం సముద్ర జలాలపై రెండు నారింజ రంగు డ్రమ్ములు తేలాడుతున్నాయి. ఇవి ఇటీవల అదృశ్యమైన ఏఎన్-32 రకం విమానం ఆచూకీ తెలియజేస్తాయన్న చిన్న ఆశ ఏర్పడింది. శిక్షణలో భాగంగా, చెన్నై తాంబరం ఎయిర్‌బేస్ నుంచి పోర్ట్‌బ్లెయిర్‌కు బయలుదేరిన ఏఎన్-32 విమానం... కొద్ది నిమిషాల్లోనే అదృశ్యమైన విషయం తెల్సిందే. ఈ విమానం కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు  
 
Video Gallery
Photo Gallery
  • Movie Gallery
  • heroins